దేశాన్ని ముందుకి నడిపిన ఘనత కాంగ్రెస్ దే..


Ens Balu
3
Visakhapatnam
2020-12-28 18:52:59

భారత దేశాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించిన ఘనత కాంగ్రెసుకే దక్కుతుంటుందని సంకు వెంకటేశ్వర రావు అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 136వ  వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురవేసి  మహాత్మాగాంధీ,ఇందిరాగాంధీ,చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ముందుండి నడిపించి స్వాతంత్య్రం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. దేశంలో, అనేక రాష్టాల్లో సుస్థిర  ప్రభుత్వాలు ఏర్పాటుచేసి జనరంజకముగా ఎంతో అనుభవజ్ఞులైన నాయకులతో సమర్ధవంతంగా పరిపాలించిన కాంగ్రెస్ సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. కాంగ్రెస్ పాలనలో చేసిన పారిశ్రామికాభివృద్ధి,వ్యవసాయరంగంలో అభివృద్ధి,సాంకేతిక అభివృద్ధి వల్లే భారత దేశానికీ గుర్తింపు వచ్చిందన్నారు. బీజేపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. అన్నదాతలను కూడా రోడ్డుమీదకీడ్చిన  ఘనత బీజేపీ పాలకులదని సంకు దుయ్యబట్టారు. త్వరలోనే రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో,డాక్టర్ సాకే శైలజానాథ్ నేత్రుత్వంలో రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసారు. భోగి రమణ,మూలా వెంకటరావు,సోడాదాసుసుధాకర్,సింకా,గుత్తుల శ్రీనివాసరావు,వజ్జిపర్తి శ్రీనివాసరావు,తుమ్మల త్రినాధరావు,నూనెల  పోలరావు,పరదేశి,మండలి శ్రీనివాసరావు,కస్తూరి తదితరులు పాల్గొన్నారు.