ముఖ్యమంత్రి పర్యటనకు పక్కా ఏర్పాట్లు..


Ens Balu
3
Vizianagaram
2020-12-28 19:00:29

 నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమం క్రింద పట్టాల పంపిణీకి ఈ నెల 30న  జిల్లాకు విచ్చేయచున్నరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహనరెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా వుండాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  అధికారులకు ఆదేశించారు.  సోమవారం గుంకలాం లే అవుట్ లో జరుగుతున్న ఏర్పాట్లను డి.ఐ.జి. కె.వి. రంగారావు, వై.సి.పి. కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, సి.ఎం. భద్రతా విభాగం అధికారులు, జిల్లా అధికారులతో కలసి పర్యవేక్షించారు.  వేదిక వద్ద నిర్మాణంలో వున్న పైలాన్, మోడల్ హౌస్, హెలిపేడ్ లబ్దిదారుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.  వేదికపై  ప్రోటోకాల్ ప్రకారంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వేదికకు అనుకొని గ్రీన్ రూమ్, టాయిలెట్ తదితర సౌకర్యాలు వుండాలని తెలిపారు.  హెలిపేడ్ నుండి  ముఖ్యమంత్రి గారి ల్యాండింగ్, పైలాన్ కు, వేదికకు చేరుకొనే రూట్ ను పరిశీలించారు.  పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లైవ్ లో అందరూ చూసేలా వేదికపైన, బ్లాకుల మద్యలో ఎల్.ఇ.డి. తెరలను ఏర్పాటు చేయాలన్నారు.  పబ్లిక్ అడ్రిస్ సిస్టం, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని, అదనపు జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్, సమాచార ఇంజనీరింగ్ అధికారుకు సూచించారు.  ప్రతీ బ్లాకునకు ఇన్ఛార్జిలుగా తహశీల్లార్లు వుండాలని, వారికి సహాయక సిబ్బందిని నియమించి బ్లాక్ల వారీగా విధులు కేటాయించాలని, సచివాలయల సిబ్బంది సహకారంతో లబ్దిదారులను వారికి కేటాయించిన ప్లాట్లలో కూర్చోపెట్టాలని తెలిపారు.  ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా త్రాగునీరు, బిస్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు.  ఈ ఏర్పాట్లన్ని మంగళవారం నాటికి పూర్తి చేసుకొవాలన్నారు.  అధికారులంతా సమన్వయతో ఎప్పటికప్పుడు చెక్ లిస్టు వ్రాసుకొని ఏలాంటి లోపాలు లేకుండా పనిచేయాలన్నారు.  అధికారులు, లబ్దిదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వినియోగించేలా చూడాలన్నారు.  ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టర్లు  డా.జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జె.వెంకటరావు, సహాయ కలెక్టర్ కె.సింహాచలం, పోలీస, జిల్లా అధికారులు పాల్గొన్నారు.