ఇళ్ట పట్టాలు పంపిణీ చేసిన తహశీల్దార్..
Ens Balu
6
జి.మాడుగుల
2020-12-28 19:15:42
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం సోమవారం జి.మాడుగుల మండలం తాహశీల్దార్ చిరంజీవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పధకాలన్నిటినీ ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని ఒక ఇంటి నిర్మాణానికి రూ.1,80,000 ఖర్చు అవుతుందని అన్నారు. జి.మాడుగుల మండలం లో 53 మందికి ఇళ్ల పట్టాలు ఈరోజు లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. జి.మాడుగుల మండలం గెమ్మిలి పంచాయతీ నుండి 47 గురు, గుల్లిపాడు గ్రామం నుండి పాంగి కుమారి, పాంగి లక్ష్మి, ఉగ్గంది వరలక్ష్మి, వంజిర గ్రామం నుండి 6 గురు పాంగి శిరీషా, పాంగి సుండ్రి మొ.గు వారు ఈరోజు పట్టాలు అందుకున్నారు. ఈకార్యక్రమంలో 191 మందికి ROFR పట్టాలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో 300 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.