డయల్ యువర్ కమిషనర్ కు 24 ఫిర్యాదులు..
Ens Balu
2
Visakhapatnam
2020-12-28 19:29:38
మహా విశాఖ నగర పాలక సంస్థ నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని అడిషనల్ కమిషనర్ అవ్వారి వెంకట రమణి అధికారులను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం లో డయల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామును అడిషనల్ కమిషనర్ , టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ఈ డయల్ యువర్ కమిషరక్ కి 24 వచ్చిన ఫిర్యాదులను ఆయ శాఖలు, జోన్లకు బదలాయించారు. ఈ సందర్భంగా ఏడిసి మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన స్పందనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో సమాచారం అందించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమానికి ఇందులో 1వ జోనుకు సంబందించి 02, 2వ జోనుకు సంబందించి 04, 3వ జోనుకు సంబందించి 04, 4వ జోనుకు సంబందించి 05, 5వ జోనుకు సంబందించి 03, 6వ జోనుకు సంబందించి 06, మొత్తము 24 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ సమావేశంలో డి.సి.(ఆర్.) రమేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, సిటీ ప్లాన్నర్ ప్రభాకర్, డి.సి.ఆర్. ఫణిరాం, జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయ భారతి, అసిస్టెంట్ డైరెక్టర్ (ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు, డి.పి.ఓ. చంద్రిక, యు.సి.డి. (ఎ.పి.డి.) సూర్యకళ, తదితరులు పాల్గొన్నారు.