మల్టీలెవర్ కార్ పార్కింగ్ పనుల పరిశీలన..
Ens Balu
2
Visakhapatnam
2020-12-28 19:45:12
మహావిశాఖ నగర పాలక సంస్థ జగదాంబ వద్ద నిర్మించిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ట్రయల్ రన్ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ జివిఎంసి కమిషనర్ జి. సృజనతో కలసి సోమవారం పరిశీలించారు. 9.70కోట్లు వ్యయంతో నిర్మితమవుతున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ లో ఐదు కారిడార్లు నిర్మిస్తుండగా ఒక్కొక్కదానిలో 20 కారులు చొప్పున 100 కారులు పార్కింగ్ చెయ్యవచ్చని కమిషనర్ మంత్రికి వివరించారు. ఈ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్నాయని ఈ నేలాఖరకు పూర్తిచేసి వినియోగించేందుకు అందుబాటులోనికి తీసుకువస్తామని కమిషనర్ మంత్రికి వివరించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ తో చాలా వరకూ ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందన్నారు. ముఖ్యమైన కూడలి జగదాంబలో ఇలాంటి అత్యాదునిక వ్యవస్థ రూపొందించడం వలన ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అన్నాకు. కార్యక్రమంలో జివిఎంసి ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, జోనల్ కమిషనర్ ఫణిరాం తదితరులు పాల్గొన్నారు.