అన్నివర్గాల సంక్షేమమే వైఎస్సార్సీపీపీ లక్ష్యం..
Ens Balu
2
Srikalahasti
2020-12-28 20:04:20
అన్ని వర్గాల సంక్షేమానికి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణ స్వామి తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఉరందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రను సృష్టించారని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ పథకాల నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక . . పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం అని, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీకి డిసెంబర్ 25న శ్రీకారం చుట్టి 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అధికారం లోకి వచ్చిన 18 నెలల్లోనే 90 శాతం మ్యానిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 2,45,633 ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఇందుకోసం 1896.26 ఎకరాల ప్రభుత్వ భూమిని 1862.11 ఎకరాల పట్టా భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. టిడ్కో ద్వారా 9,730 మందికి, 94,128 మందికి పొసెషన్ సర్టిఫికేట్లు అందించడం జరుగుతున్నదని, నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు మాట్లాడుతూ సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి నవరత్నాలు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే మహోన్నత కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ మన రాష్ట్రానికే చెందుతుందని, ఈ కార్యక్రమం అనంతరం 17,500 వై.ఎస్. ఆర్ జగనన్న కాలనీలు ఏర్పడతాయని, వీటిలో అన్ని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషకరమైన విషయం అని ఈ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ ఏ సంక్షేమ పథకం ద్వారా పొందే లబ్ధినైనా మహిళలకే చెందేలా పథకాల రూపకల్పన జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తిలో నేడు పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాలకు కేటాయించిన భూమికి మంచి మార్కెట్ విలువ కలదని, ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ళు కేటాయించడం అదృష్టమని, ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మినీ శ్రీకాళహస్తిగా మారనున్నదని సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్.ఎస్. కెనాల్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
చిత్తూరు జిల్లాలో మరో బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టం అని మొదట 2020 జనవరి 9 న అమ్మఒడి కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగిందని, మరోమారు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభించడం జిల్లా ప్రజలు చేసుకున్నా అదృష్టం అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,760 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నామని, తద్వారా 2,46,631 మందికి లబ్ధి చేకూరననుంది. భూ సేకరణ నిమిత్తం పరిహారం కింద రూ.343.26 కోట్లు చెల్లించాం. 3,760 ఎకరాల్లో . . చిత్తూరు అర్బన్ లో 117.31 ఎకరాలు, చిత్తూరు రూరల్ లో 225.95 ఎకరాలు ఉంది. ఈ మొత్తం లో 1903.9 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా . . 1856.47 ఎకరాలు డి కె టి . . పట్టా భూమి ఉంది. రూరల్ ప్రాంతాల్లో 1,81,661 మంది, అర్బన్ ప్రాంతాల్లో 64,970 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 1,267 లే అవుట్లు కలవు . . చిత్తూరు రూరల్ పరిధిలో 1,206, అర్బన్ పరిధిలో 61 లేఔట్లు ఉన్నాయి. వీటిలో 54,242 ఇంటి పట్టాలు, 10,728 టిడ్కో పట్టాలు ఉన్నాయి. రూరల్ లో 87,533 ఇంటి పట్టాలు ఉన్నాయని తెలిపారు.