ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సాదర వీడ్కోలు..
Ens Balu
2
Srikalahasti
2020-12-28 20:10:23
‘నవరత్నాల లో బాగంగా పేదలందరికీ ఇళ్లు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం,శ్రీకాళహస్తి మండలం, ఊరందూరు గ్రామ పంచాయతీ నందు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల పనులకు శంకుస్థాపన చేసి తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు సభా స్థలం నుండి బయలుదేరి ఊరందురు గ్రామాం నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి సదార వీడ్కోలు పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, శాసన సభ్యులు శ్రీకాళహస్తి,బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి, భూమన కరుణాకర రెడ్డి, సత్యవేడు ఆదిమూలం, జిల్లా కలెక్టర్ డాక్టరు నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి,ముఖ్యమంత్రి కి వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఊరందురు హెలిప్యాడు నుండి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.