పండుగలా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ..
Ens Balu
2
Srikalahasti
2020-12-28 20:11:57
రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ఉరందూరులో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ప్రజల హర్షద్వానాల నడుమ ఉప్పొంగిన అభిమానంతో వెల్లువలా వచ్చిన ప్రజానికంతో బహిరంగ సభ విజయవంతమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రి తొలుత బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆవిష్కరించి సభా వేదికకు చేరుకొన్న ముఖ్యమంత్రికి ప్రజలు పెద్ద ఎత్తున కరతాళద్వనులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త స్వాగత ఉపన్యాసం చేయగా, శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి అద్యక్షత వహించగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు రంగనాథ రాజు ప్రసంగించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరగగా, ముఖ్యమంత్రికి జ్ఞాపికను జిల్లా యంత్రాంగం తరపున మంత్రులు, శాసన సభ్యులు, కలెక్టర్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లు రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపిాఐఐసి చైర్ పర్సన్ రోజా, శాసన సభ్యులు కరుణాకర రెడ్డి, ఆదిమూలం, నవాజ్ బాషా, ద్వారకనాథ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, వెంకటే గౌడ్, ఆరణి శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలకులు తలశీల రఘురాం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త, జాయింట్ కలెక్టర్లు డి. మార్కండేయులు, వి. వీరబ్రహ్మం, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.