కరోనా టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలి..
Ens Balu
4
Visakhapatnam
2020-12-28 21:03:43
కరోనా టీకాలు వేయడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలందరికీ టీకాలు వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ముందుగా రూపొందించుకోవాలన్నారు. వేక్సీన్ వేసేందుకు ముందుగా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి, వ్యాక్సిన్ ను భద్రపరచడం, రవాణా రోజుకు ఎంతమందికి వేయాలి మొదలైనవన్నీ ముందుగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అంతకు ముందు రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులపై ఆమె పరిశీలన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరుణ తగ్గుముఖం పడుతున్నప్పటికీ అజాగ్రత్తగా ఉండ రాదన్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండి పరిస్థితులను గమనించాలన్నారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారిపై నిఘా వుంచి వారిని పరీక్ష చేయడం తదితర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం నుండి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణా రావు జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.