ప్రభుత్వానికి రైతులంటే మమకారం, బాధ్యత..
Ens Balu
3
Srikakulam
2020-12-29 16:14:16
రైతులపై ప్రేమ, మమకారంతో, బాధ్యతతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ రైతు భరోసా మూడవ విడత పంపిణీ కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైయస్సార్ రైతు భరోసా పి. ఎం. కిసాస్ పథకం కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు సాగుదార్లకు ఏటా రూ.13,500 చొప్పున, అయిదేళ్లలో రూ.67,500 అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రములోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా సొమ్మును "వైయస్సార్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా - ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500; రెండో విడతగా - అక్టోబరులో ఖరీఫ్ పంట కోత లేదా రబీ అవసరాలకు రూ. 4000; మూడో విడతగా - ధాన్యం ఇంటికి చేరేవేళ, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 ఇవ్వడం జరుగుతోందన్నారు.
2019-20 సంవత్సరములో "వైయస్సార్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం"కింద, రాష్టములోని 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6,534 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో మొదటిస రెండవ విడతలో రాష్ట్రములోని 50.47 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,805 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరం మూడవ విడతలో రాష్ట్రములోని 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ. 1120 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 18 నెలల కాలంలో రైతుల కోసం రాష్ట్రంలో రూ.61,400 కోట్లు ఖర్చు చేసామని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ అందించుటకు 10 వేల మెగా వాట్ల సోలార్ పవర్ కు టెండర్లు పిలిచామని ముఖ్య మంత్రి చెప్పారు.
2019-20 సంవత్సరములో "వైయస్సార్ రైతు భరోసా - పి. ఎం.కిసాన్ పథకం"కింద శ్రీకాకుళం జిల్లాలోని 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగింది. 2020-21 సంవత్సరంలో రెండు విడతల్లో శ్రీకాకుళం జిల్లాలోని 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ. 423 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది. 2020-21 సంవత్సరంలో మూడవ విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ. 85.78 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగింది. ఇందులో గ్రీవిన్స్ లో పెట్టిన 12,801 మంది రైతులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ప్రత్యేక అంశంగా చెప్పవచ్చును.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, ఎడి ఆర్.రవి ప్రకాష్., ప్రకాష్, మహిళా సంఘాల సభ్యులు సుగుణ,ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం కు చెందిన గుండ ఫాల్గుణ ఆమదాలవలస మండలం లొద్దలపేట కు చెందిన పూజారి వెంకట కాంతారావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.