ఏయూతో ఎన్‌సిసి ఎంఓయూ..
Ens Balu
2
Visakhapatnam
2020-12-29 16:39:23
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో నేషనల్ కేడెట్ కార్పస్(ఎన్‌సిసి) అవగాహన ఒప్పందం చేసుకుంది. మంగళవారం ఏయూ వీసీ కార్యాలయంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ ఎన్‌సిసి గ్రూప్ విశాఖపట్నం కెప్టెన్ నీరజ్ సిరోహిలు సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసి అధికారులకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లమో సర్టిఫీకేట్లు ప్రధానం చేసే దిశగా ఈ ఎంఓయూ నిలుస్తుందన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఎన్‌సిసి అధికారులకు సర్వీస్ ట్రైనిగ్, ఐదేళ్ల ఉద్యోగ బాధ్యతలు పూర్తిచేసిన వారికి ఈ సర్టిఫీకేట్‌ను అందించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌సిసికి అందిస్తున్న ప్రోత్సాహం పట్ల ఎన్‌సిసి గ్రూప్ కమాండర్ నీరజ్ సిరోహి సంతోషం వ్యక్తం చేశారు. అంధ్రవిశ్వవిద్యాలయం సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీన్ సంచాలకులు ఆచార్య కె.నిరంజన్, అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్,ఎన్‌సిసి అధికారులు డి.టి ఆంతోని, ఎం.డి సజిత్, కె.జె శర్మ తదితరులు పాల్గొన్నారు.