వికలాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి..


Ens Balu
3
Amalapuram
2020-12-29 16:52:57

వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అమలాపురం షాధీఖానా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగుల న్యాయపరమైన అన్ని కోరికలు నెరవేర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,వికలాంగుల కోరిక మేరకు వచ్చే డిసెంబర్ మాసానికి అమలాపురం లో వికలాంగుల కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు సంభందించి అమలాపురం లో 5 సెంట్లు ప్రభుత్వ భూమి కొరకు మునిసిపల్ కమీషనర్ కు సూచిస్తానని మంత్రి తెలియ చేసారు. అలాగే వికలాంగులు ప్రస్తుతం వికలాంగులు తీసుకుంటున్న 3 వేల రూపాయల పెన్షన్ ను 5 వేలు చేయాలని కోరారని, ఈ విషయాన్ని కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని,అవసరమైతే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి న్యాయమైన మీ కోరిక ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు వెళతానని మంత్రి తెలియ చేసారు. మీకు ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుందని మంత్రి అన్నారు.అలాగే వికలాంగుల కార్పోరేషన్ లో డైరెక్టర్ గా అమలాపురానికి చెందిన దివ్యాంగుల్లో ఒకరికి స్థానం కల్పించాలనే   మీ కోరికను దృష్టి లో వుంచుకొని తప్పక  అమలాపురం నుంచి మీరు ప్రతిపాదించిన వ్యక్తికి రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ లో డైరెక్టర్ గా నియమించేలా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.అలాగే ఒంటెద్దు వెంకన్నాయుడు వికలాంగుల అనేక సమస్యలను నా దృష్టి తీసుకు వచ్చారని వాటన్నిటినీ డి.టి.పి. చేయించి నాకు ఇస్తే వాటన్నింటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని మంత్రి తెలియ చేసారు. అలాగే ట్రై సైకిల్స్ కావలసిన దివ్యాంగుల వివరాలు నాకు ఇస్తే రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి  వారందరికీ ట్రై సైకిల్స్ వచ్చేలా చేస్తానని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో దివ్యాంగులకు ఆహార పొట్లాలు,దుప్పట్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనసీమ దివ్యాన్గుల సంక్షేమ సంఘం జే.ఏ.సి. గౌరవ అధ్యక్షులు ఒంటెద్దు వెంకన్నాయుడు, చెల్లు బోయిన శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్,డా.పినిపే శ్రీకాంత్,కోనసీమ డివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు,అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అమలాపురం డివిజన్ అధ్యక్షులు పెనుమాళ్ళ నాగరాజు, ఏ.పి. రాష్ట్ర దివ్యాంగుల మహా సంఘటన్ అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్,అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అమలాపురం పార్లమెంట్ నియోజక వర్గం యించార్జ్ బొంతు శ్రీనివాస్,దొమ్మెటి రాము, జంపన రమేష్ రాజు, కొల్లాటి దుర్గాబాయి,తోట శ్రీను,నక్కా సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.