నలుగురికి కారుణ్య నియామక ఉత్తర్వులు..


Ens Balu
3
Kakinada
2020-12-29 17:00:06

తూర్పుగోదావరి జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారంతా అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో నలుగురికి  కారుణ్య నియామ‌కాల కింద ఉద్యోగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  క‌ష్ట‌పడి ప‌నిచేసి మంచి పేరు తెచ్చుకోవాల‌ని సూచించారు. ఉద్యోగులు మరణించిన అనంతరం వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే మానవతా ద్రుక్పదంతో కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టామని వివరించారు. నలుగురిని నాలుగు శాఖల్లో నియమించారు. అంతేకాకుండా మిగిలిన కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా తక్షణమే శాఖాపరమైన పనులు పూర్తిచేసి వారికి కూడా నియమాకాలు చేపట్టాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  పరిపాలనాధికారి పాల్గొన్నారు.