ప్రజా మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించాలి..


Ens Balu
4
Visakhapatnam
2020-12-29 18:46:49

జివిఎంసీ పరిధిలోని అన్ని ప్రజామరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నగర పరిధిలోని ఐదవ జోన్ లో 58వ వార్డులోని పారిశుద్ధ్య పనులను క్షేత్ర పర్యటనలో తనిఖీ చేసారు. ఈ సందర్భంగా  నాతయ్యపాలెం, అక్కిరెడ్డి పాలెం ప్రాంతాలలో పర్యటించి ప్రజా సౌకర్యార్ధం ఏర్పరిచిన ప్రజా మరుగుదొడ్ల పనితీరు సంబందించి శానిటరీ ఇన్ స్పెక్టర్లతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరుగుదొడ్లలో గుర్తించిన చిన్న చిన్న రిపేర్లను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. త్వరలోని ఓ.డి.ఎఫ్. బృందం తనిఖీలు నిర్వహించే అవకాసం ఉన్నందున మరుగుదొడ్లలో అన్ని సామాగ్రీలు ఉన్నట్లు చూసుకోవాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. వార్డులో పర్యటిస్తూ చెత్తను వేరుచేసి చేపడుతున్న సేకరణను క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చెత్తను వేరు చేసి ఇవ్వడంపై ప్రజలకు మరింత అవకాసం కల్పించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు, వార్డు శానిటరీ కార్యదర్శులకు సూచించారు. సీజనల్ వ్యాదులపై నిరంతరం చేస్తున్న సర్వేను ఏ విధంగా చేస్తున్నారో అని శానిటరీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో 58వ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.