అక్కా చెల్లమ్మల అభివ్రుద్దే ప్రభుత్వ ధ్యేయం..


Ens Balu
4
Kurnool
2020-12-29 18:49:40

అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి పట్టాలను మంజూరు చేసి, పేదల కళ్లలో ఆనందం చూడటమే  సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని  కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఏ. హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం నవరత్నాలు--పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా  కర్నూలు మండలం రుద్రవరం గ్రామం వద్ద ప్రభుత్వం గుర్తించిన లేఅవుట్ లో ఇంటి స్థలాల సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, డి.ఆర్.ఓ పుల్లయ్య హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న కాలనీల నిర్మాణంలో ఇప్పటికే శంకుస్థాపన చేశామని 17,000 ఇళ్ళను నిర్మించి లక్ష జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. అలాగే 1 రూపాయికే టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. మేము పాలకులుగా కాకుండా సేవకులుగా ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.  అనంతరం కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ...మొత్తం 377 ఎకరాల లేఅవుట్ ను 39 బ్లాక్కులుగా విభజించడానికి మునిసిపల్, రెవెన్యూ, సర్వే, ప్లానింగ్ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని..వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి ఇంటి పట్టాలను అందించడానికి కృషి చేశామన్నారు. పట్టాలు అందని లబ్ధిదారులు మీ పరిధిలోకి వచ్చే వార్డు సచివాలయ వి.ఆర్.ఓ ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక ఎస్ఈ సురేంద్రబాబు, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, డిఈ రాధాకృష్ణ, ఏఈ జనార్ధన్, తాలూకా సిఐ విక్రమ్ సింహ తదితరులు పాల్గొన్నారు.