డీఎం సీట్లలో రిమ్స్ విద్యార్ధుల ప్రతిభ..


Ens Balu
2
Srikakulam
2020-12-29 19:21:19

శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో మొదటి ఎం.బి.బి.ఎస్ బ్యాచ్ (2008) విద్యార్ధులు సూపర్ స్పెషాలిటిలో డి.ఎం సీట్లు సాధించడంలో హవా కొనసాగించారని ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటిండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించారని ఆయన పేర్కొన్నారు. డా.పల్లి షర్మిల సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎండోక్రినాలజిలో డి.ఎం సీట్ పొందగా, డా.యమునా రాణి గుంటూరు వైద్య కళాశాలలో న్యూరాలజి విభాగంలోను, డా.త్రిమూర్తులు లక్నోలోని ఎస్.జి.పి.జి.సంస్ధలో క్రిటికల్ కేర్ విభాగంలోను, డా.లక్ష్మి నారాయణ విశాఖపట్నం మహాత్మ గాంధీ కేన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజీ విభాగంలోను డి.ఎం సీట్లు సాధించారని తెలిపారు. మరిన్ని మంచి విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.