ఉత్తమ జర్నలిస్టులను తీర్చిదిద్దడమే లక్ష్యం..


Ens Balu
2
Tirupati
2020-12-29 20:06:44

జర్నలిస్టులలో  నైతిక విలువలు పెంచి మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రెస్ అకాడమీ పనిచేస్తుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ జర్నలిజం అస్వస్థత అయిన  సమయంలో అకాడమీ ఛైర్మన్ గా నా శక్తి సరిపోతుందా అనే ప్రశ్న నన్ను వెంటాడుతున్నదని, నిబద్దత , నిష్పక్షపాత, సామాజిక స్పృహ , నైతిక విలువలు కలిగిన జర్నలిస్టులకు సమాజంలో గౌరవం ఎప్పుడూ దక్కుతుందని అన్నారు.  జాగ్రత్తలు కలిగి వార్తల  సేకరణ వృతి మమకారం , గౌరవం విలువలు  పాటించాల్సిన సమయం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని అన్నారు. తన అనుభవాలు పంచుకుంటూ రాయలసీమ వర్షపాతం లేని ప్రాతం కావడం , నీళ్లులేక వ్యవసాయం సాగక వేరొకరి పంచన చేరి కక్షలు , కార్పణ్యలకు తావువివ్వడం గమనించి , నీళ్లులేకే కధా సమాజం ఇలావుందని ఆలోచన చేసినట్టు చెప్పారు. అప్పటి ఇరిగేషన్ అధికారులతో నికరజలాలు – మిగులు జలాలు ఏంటని తెలుసుకుని పనిచేస్తున్నది ఆంధ్రప్రభ అయినా అందరి మిత్రులతో కలసి సమాజ చైతన్య వార్తలు రాయడంతో ఉద్యమం రూపుదాల్చి నేడు నీటి సౌకర్యం కలిగియున్న  చిత్రావతి, గండి కోట చూస్తే సంతృప్తి కలుగుతున్నదని ఆకోణంలో ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించే వార్తలకు ప్రాధాన్యానిస్తే జర్నలిజం మనుగడ సాగిస్తుందని అన్నారు.   జర్నలిజం కోర్సులకు అకాడమీ ప్రోత్సాహం ఇవ్వనున్నదని, ఇప్పటికే అకాడమీ 12 పుస్తకాలను రూపకల్పన చేసిందని, కరోనా మహమ్మారితో నేరుగా 13 జిల్లాల జర్నలిజం క్లాసులు ఇవ్వకపోయినా జూమ్ యాప్ ద్వారా 11 జిల్లాలు పూర్తి చేశామని, విలేకర్ల స్పందన చూస్తే పూర్వ వైభవం జర్నలిజం తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టిలో వుంచమని న్యాయం జరుగుతుందని తెలిపారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ కరోనా సంక్షోభంతో ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు అందాల్సినవాటిపై దృష్టి పెట్టాలని కోరారు. గత 30 సంవత్సరాల్లో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ది చెందింది, సాంకేతికత వల్ల జర్నలిస్టులకు వుపాధి అవకాశాలు తగ్గాయని అన్నారు. జర్నలిజంలో వున్నవారు 99 శాతం పేదలని వారికి ప్రభుత్వ పరం గా గౌరవప్రధంగా అండాల్సిన వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. భవిష్యత్తు సోషల్ మీడియాదే , జరంలిస్టులలో ఆందోళన వుంది అందుకు అనుగుణంగా మారాల్సివుందని తెలిపారు. ఎస్.వి.యూనివర్సిటీ లో విలువలుకలిగిన జర్నలిజం కోర్సులు తిరిగి ప్రారంభించాలని విసి ని కోరారు.  ఎస్.వి.యూనివర్సిటీ విసి మాట్లాడుతూ నిర్మాణాత్మక జర్నలిజం ఎల్లప్పుడూ ఒక స్థానం గర్వాన్ని కలిగి ఉంటుంది. సమాజంలో శ్రీ దేవిరెడ్డి శ్రీనాధ్ గారు ఈ రకమైన వారు అని నేను నమ్ముతాను. నైతిక నివేదన మరియు నిర్మాణాత్మక జర్నలిజం ఎల్లప్పుడూ ఒక స్థానం కలిగియుంటుందని అందుకు నిదర్శనమే నేటి  సమాజంలో శ్రీ దేవిరెడ్డి శ్రీనాధ్ గారు అన్నారు. వియత్నం గటన జర్నలిజం, ఫోటో జర్నలిజంకు సాక్ష్యాలుగా నేటికీ నిలుస్తున్నాయని వివరించారు. స్థానిక పాత్రికేయులు ఎస్.వి.యు.రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి , రవికుమార్, ఆనందరావు, మురళి, నగేష్ , లక్ష్మీపతి, జగన్నాధం, లోకేష్, సురేంద్రరెడ్డి,రామచంద్రా రెడ్డి, మణికుమార్, నేతాజీ , మహిళా విశ్వవిద్యాలయ జర్నలిజం అద్యపకులు త్రిపుర సుందరి,వాణి, టిటిడి పిఆర్.ఓ. రవి  తదితరులు  తమ అభిప్రాయాలను తెలుపుతూ ఛైర్మన్ ను ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు శ్రీధర్, రచయిత రాజగోపాల్ నిర్వహించిన శ్రీనాధ్ మిత్రా బృందం ఆత్మీయ సమావేశం స్థానిక ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ లో నిర్వహించగా సభ  అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వర రావు, విశిష్ట అతిధిగా ఎస్ వి.యూనివర్సిటీ విసి రాజారెడ్డి  పాల్గొన్నారు.