నిర్దేశిత ప్రణాళికలతో జిల్లా ప్రగతి..
Ens Balu
1
Srikakulam
2020-12-29 20:27:43
నిర్దేశిత ప్రణాళికలతో ప్రగతి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో తహశీల్దారులు, మండల అభివృధ్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బి.టి.రోడ్లు, సి.సి.రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, గ్రామ సచివాలయాల నిర్మాణం తదితర ఇంజనీరింగు పనులపై మండలవారీగా వారాంతపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత వారం కన్నా ఈ వారంలో ప్రగతి సాధన బాగున్నదని ప్రశంసించారు. సీతంపేట, కంచిలి, రేగిడి మండలాలలో ఇంజనీరింగ్ పనులు బాగా జరిగాయన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, సిమ్మెంటు కొరత లేదని తెలిపారు. ముఖ్యంగా ఉపాధిహామీ పనులకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. మండలంలో వారానికి ఒక కిలో మీటరు చొప్పున రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్ల సమన్వయంతో పనులు చేయాలన్నారు. డి.ఇ.ల వారీగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. ఇసుక కొరతను అధిగమించడానికి గాను దగ్గరలో వున్న ఇసుక రీచ్ ల నుండి తీసుకోవాలన్నారు సి.సి. రోడ్ల నిర్మాణానికి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పనులు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించడం జరిగిందని, వారి సహకారం తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలు వేగవంతం కావాలన్నారు. నిర్ధిష్ట ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. ఆర్.కె.భాస్కర్,. జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, ఆర్.డబ్ల్యు,ఎస్, పంచాయితీరాజ్ డి.ఇ.లు, ఎ.ఇ.లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.