శ్రీకాకుళంలో టిడ్కో ఒప్పంద పత్రాల పంపిణీ..
Ens Balu
0
Srikakulam
2020-12-30 18:18:20
శ్రీకాకుళంలో టిడ్కో గృహాల విక్రయాల ఒప్పంద పత్రాలను లబ్దిదారులకు బుధ వారం నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య అందజేసారు. బాపూజి కళామందిర్ లో జరిగిన కార్యక్రమంలో పత్రాలను నల్లనయ్య అందజేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఆయన అన్నారు. పేద ప్రజానీకానికి గూడు కల్పంచాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొంటూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టిడ్కో గృహా సముదాయం చక్కని ప్రదేశంలో ఉందని ఆయన అన్నారు. వెయ్యికి పైగా కుటుంబాలు నివశిస్తూ మంచి కాలనీగా అవతరించనుందని ఆయన చెప్పారు. టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను అక్కాచెల్లెమ్మలకు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 300 చదరపు అడుగులు టిడ్కో గృహాలను కేవలం రూపాయికే ప్రభుత్వం అందిస్తుందని, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ళకు లబ్దిదారులు కట్టవలసిన ముందస్తు వాటాలోని 50 శాతం సొమ్ము కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన అన్నారు. పేద వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని కమీషనర్ అన్నారు. అంతకుముందు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని లైవ్ ద్వారా లబ్దిదారులకు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ ఓ జగన్మోహన రావు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.