పారిశుధ్య నిర్వహణ సచివాలయ సిబ్బందిదే..


Ens Balu
3
Visakhapatnam
2020-12-30 19:58:35

జివిఎంసీ పరిధిలో పారిశుధ్యం, ప్రజామరుగు దొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని శానిటరీ ఇనెస్పెక్టర్లను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. బుధవారం  రెండవ జోన్ లో 9, 11 వార్డులలో పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, అన్నివార్డుల్లోని సచివాలయ సిబ్బంది పారిశుధ్యం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అనంతరం 9, 11వార్డు లలో  సీతమ్మధార, టి.పి.టి కొలని, గురుద్వారా తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనుల  వార్డుల శానిటరీ ఇన్స్పెక్టర్ల తో కలసి క్షేత్ర పరిశీలన చేసారు. మరుగుదొడ్లకు రిపేర్లు అవసరమైనచో వెంటనే చేయించాలని ఆదేశించారు.  ఒ.డి.ఫ్. బృందం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు స్వచ్చ సర్వేక్షణ్ -2021పై అవగాహన కల్పించాలని, తడి - పొడి చెత్తను వేరు చేసి తీసుకోవాలని పారిశుధ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు.  ప్రతి రోజూ ఉదయం వార్డులలో వార్డు శానిటరీ కార్యదర్శులు పర్యటించి సీజనల్ వ్యాధులపై పరిశీలన సూక్ష్మ స్థాయిలో చేయాలన్నారు. పర్యటనలో  9,11 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆయా వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.