గ్రామ సచివాలయాలన్నీగుగూల్ మ్యాపింగ్ జరగాలి..
Ens Balu
2
Anantapur
2020-12-30 20:34:24
అనంతపురం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల కార్యాలయాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం రాత్రి గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ విషయమై జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వార్డు అడ్మిన్స్ తో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1207 గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ ను గురువారం సాయంత్రం లోగా 100 శాతం పూర్తి చేయాలన్నారు. గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ చేయడం ద్వారా జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భవనాలు అయిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను సులభంగా గుర్తించే వీలు కలుగుతుందన్నారు.
జిల్లాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా మ్యాపింగ్ కాకుండా ఉండడానికి వీలు లేదన్నారు. అన్ని భవనాలకు సంబంధించి సచివాలయం పేరు, క్యాటగిరి, లొకేషన్, సచివాలయం ఫోటోలు, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ లాంటి అన్ని వివరాలతో గూగుల్ మ్యాప్ లో మ్యాపింగ్ ను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ పూర్తయిన తర్వాత అన్ని భవనాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు అందించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఏ భవనంలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కార్యాలయం కొనసాగుతుందో ఆ వివరాలను మ్యాపింగ్ చేయాలని, నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యాక మార్పులు చేర్పులు చేపట్టి ఆయా భవనాలను మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రజలకు పూర్తి వివరాలు తెలిసేలా మ్యాపింగ్ ను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కు సంబంధించి గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ ఎలా చేయాలనేది వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ గూగుల్ మ్యాప్ లో కి మ్యాపింగ్ ను జాగ్రత్తగా చేపట్టాలని, అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలన్నారు.