కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి పక్కా ఏర్పాట్లు..
Ens Balu
3
Chittoor
2020-12-30 20:42:39
చిత్తూరు జిల్లాలో కోవిడ్ - 19 వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త అన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 45 నుండి 55 లక్షల వ్యాక్సిన్ డోస్ లను నిల్వ ఉంచడానికి 135 కోల్డ్ చైన్ పాయింట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 45 నుంచి 55 లక్షల డోస్ లను నిల్వ ఉంచేందుకు సిద్దం చేశామన్నారు. జిల్లాలో 44.91 లక్షల మంది ఉన్నారని, ఇందులో 213 ప్రభుత్వ వైద్య సంస్థలు ఉన్నాయని 527 పై ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని, ప్రభుత్వ వైధ్య సంస్థలలో 15,617, ప్రైవేట్ వైధ్య సంస్థలలో 15,859 ఇందులో మెడికల్ విద్యార్ధులు 559 హౌస్ సర్జన్ వారు 424 మంది ఉన్నారని ఇటీవల నిర్వహించిన కోవిడ్ వాక్సిన్ పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా జూమ్ ట్రైనింగ్ ద్వారా బ్లాక్ లెవల్ లోనూ 427 మంది హాజరయ్యారని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణికి జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆద్వర్యంలో ఐ.సి.డి.ఎస్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్, అయూష్, పట్టణ అభివృద్ది, క్రీడలు, యువజన విభాగం, పోలీసు శాఖ, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, సమాచార శాఖ, రక్షణ విభాగం, సివిల్ సప్లైస్, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫర్, పశు సంవర్ధక శాఖ, రైల్వే విభాగం, కార్మిక విభాగం, ఐ.టి విభాగం, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, విద్యుత్ శాఖ, మునిసిపల్ శాఖ, రవాణా శాఖ, ఏ.పి.మెడికల్ ఎడ్యుకేషన్, ఐ.ఎం.ఏ వారి సహాయాలను తీసుకొని వ్యాక్సిన్ రవాణా చేసే కార్యక్రమం నుండి నిల్వ చేయడం, పంపిణి వరకు అందరి సహకారంతో పనిచేయడం జరుగుతుందని ఇందు కోసం 101 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 18 మాక్స్ కేంద్రాలు, 4 పి.పి యూనిట్లు మరియు ఇతర సంస్థలు కలిపి 145 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. అదే విధంగా 8 మంది డాక్టర్లతో పర్యవేక్షణ బృందం ఏర్పాటు, జిల్లా స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి సరళి పరిశీలించడం కోసం కోవిడ్ వ్యాక్సిన్ సెల్ ను జిల్లా వైధ్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆద్వర్యంలో జిల్లా స్థాయిలో నడుస్తుందని ఇందు కోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, డి.ఎం అండ్ హెచ్ ఓ, డి.సి.హెచ్.ఎస్ లు డా.పెంచలయ్య, డా.సరళమ్మ, డి.టి.సి బసిరెడ్డి, ఇతర సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.