ఎస్వీ జూపార్కులో కోవిడ్ నిబంధనలు భేష్..


Ens Balu
2
Tirupati
2020-12-30 20:44:18

ఎస్.వి.జూ పార్క్ నందు కోవిడ్ నిబంధనలలో సందర్శకులను  అనుమతిస్తున్న విధానం బాగుందని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బుధవారం  ఉదయం ఛైర్మన్ కుటుంబ సభ్యులతో ఎస్.వి. జూ పార్క్ చేరుకోగా క్యురేటర్ హిమ శైలజ స్వాగతం పలికారు. ఛైర్మన్ జూ సందర్శన అనంతరం క్యురేటర్ తో సమావేశమై అన్ని  జాగ్రత్తలతో తిరిగి సందర్శకుల అనుమతి బాగుందని తెలిపారు. ఎస్.వి. జూ పార్క్ కోసం ప్రభుత్వం నుండి గానీ, ప్రెస్ అకాడమీ నుండి ఎల్లపుడూ సహకారం ఉంటుందని తెలిపారు.  క్యూరేటర్ హిమశైలజ  వివరిస్తూ కోవిడ్ కారణంగా గత మార్చి 20 నవంబర్ 16 వరకు సందర్శకులను అనుమతి నిలిపి వేశామని తెలిపారు.  ఎస్.వి. జూ నిర్వాహణ కు ఏడాదికి రూ.5 కోట్లుగా ఉంటుందని, అందులో సగం జంతువుల డైట్ ఖర్చులు ఉంటాయని తెలిపారు. ఎస్.వి.జూ పార్క్ మరింత అభివృద్ధి  కోసం జంతువుల  ఆడాప్షన్ స్కీమ్, డొనేషన్ వంటివి స్వీకరిస్తున్నామని దాతల స్పందన బాగుందని తెలిపారు. దాదాపు 1200 హెక్టార్లలో విస్తీర్ణంలో వున్నా  289 హెక్టార్లలో మాత్రమే ఈ ప్రదర్శన శాల ఉందని, ఇక్కడ ప్రత్యేకత ప్రకృతి సిద్ధంగా అడవిలో పర్యటిస్తూ జంతువీక్షన అనుభూతి కలుగుతుందని  తెలిపారు. అడాప్షన్ స్కీమ్ పై ప్రచారం కల్పించాలని క్యూరేటర్ అకాడమీ ఛైర్మన్ కు విన్నవించారు. ఛైర్మన్ పర్యటనలో జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దీపక్ జంతు విశేషాలను , జూ పార్క్ ప్రాముఖ్యతను వివరించారు.