నూతన సవంత్సర వేడుకలు నిషేధం..
Ens Balu
4
Kakinada
2020-12-30 21:52:35
తూర్పు గోదావరి జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై నిషేధం అమలులో ఉందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాకి ప్రత్యేక ప్రకటన జారీచేశారు. 31.12.2020 రాత్రి బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు జిల్లాలో ఏ ఒక్కరికీ ఏ రకమైన అనుమతులనూ ఇవ్వ లేదని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాధి ప్రాబల్యం అధికంగా ఉండటం, చలి మంచు వాతావరణంలో అది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాలలో హైవే పై , రోడ్డుల వెంబడి కేక్ కటింగ్ లు వగైరా వేడుకలు జరుపకూడదన్నారు. వ్యాపార సంస్ధలు, ఇతర షాపులు, బార్లు, వైన్ షాప్ లు రెస్టారెంట్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ఖచ్చితంగా మూసి వేయాలని బార్ అండ్ రెస్టారెంట్లలో, హోటళ్లలో అశ్లీల నృత్యాలు నిర్వహించినా వేడుకల పేరిట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకొంటారని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో బాణ సంచా కాల్చి పక్క వారికి ఇబ్బంది కలిగించినా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, బైక్ రేసింగ్, కేరింతలు కొడుతూ మోటార్ రేసులు చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి అదనపు బలగాలతో గస్తీ ముమ్మరంగా ఉంటుందని జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన రోడ్ల కూడళ్ళలో పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తూర్పు గోదావరి జిల్లా ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆ ప్రకటనలో కోరారు.