ఏపీలో అత్యవసర సేవలు ఇక సులభతరం..
Ens Balu
2
Tadepalle
2020-12-31 14:29:45
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలు, అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్సు ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్నిరకాల ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్‌ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వాహనాలకు సంఘటనా స్థలం వద్ద జరిగిన విపత్తును లైవ్ లో రికార్డింగ్ చేయడానికి సైతం అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ అయి వుంటాయి. తద్వారా విపత్తును బట్టి లైవ్ మానటరింగ్ చేస్తూ..అవసరమైన అదనపు సిబ్బందిని పంపేందకు వీలుపడుతుంది. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని సీఎం చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పిన సీఎం త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిస్థాయి హైఎండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ గా మార్పు చేస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రకటించారు.