రాజమహేంద్రం అభివ్రుద్ధికే పెద్దపీట..


Ens Balu
3
Rajahmundry
2020-12-31 14:48:46

రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికై  కేంద్ర ప్రభుత్వమునుంచి గరిష్టంగా నిధులు సేకరించి అభివృద్దిపధంలో  నియోజకవర్గాన్ని నిలిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు స్దానిక పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్‌ ‌రామ్‌ ‌పేర్కొన్నారు. గురువారం స్దానిక మార్గాని ఎస్టేట్‌ ‌నందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికి  నూతన సంవత్సర శుభాకాక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో మానవాళిని దేవుడు ఆశ్వీరదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 2021 సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వైద్యపరంగా అప్రమత్తంగా వుండి భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవం వచ్చినా సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి సంతోష్‌ ‌గంగ్వార్‌ ‌వారు స్దానికంగా ఇ ఎస్‌.ఐ ఆసుపత్రిని పేపరు మిల్లుగా పాత భవనాన్ని తోలగించి 3న్నర ఎకరాలు స్దలంలో  100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ 97.98 కోట్లు నిధులు మంజూరు చేసారన్నారు.  అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జనవరి రెండవ వారంలో ఆసుపత్రి శంకుస్దాపన కార్యక్రమానికి హాజరుకావన్నుట్లు ఆయన వెల్లడించారు.  టెండర్లు్ల పిలవడం జరిగిందన్నారు. రాబోయే రెండు సంవత్సరాల కాలవ్యవధిలో నిర్మాణం పూర్తి చేయడానికి కార్యాచరణ తీసుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా  గోపాలపురం నియోజకవర్గ  పరిదిలోని గౌరీపట్నం గ్రామంలో 5 ఎకరాలు స్దలంలో 100 పడకల ఇ.ఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ రెండు ఆసుపత్రులకు కేంద్ర మంత్రి శంకుస్దాపన చేస్తారన్నారు. కావున వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు వర్కర్లు  దిగువ మధ్యతరగతి వర్కర్లు ఇఎస్‌ఐలో నమోదు చేసుకొని ఆయా వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించి ఆపై  ఒక  వైద్య కళాశాలను మంజూరు చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుందన్నారు. ఇందుకుగాను కేంద్ర కారాగారం ఎదురుగా 12.91 ఎకరాలు స్దలాన్ని ఎంపిక చేసామన్నారు.  రాబోయే రెండు సంవత్సరాల కాలములో నిర్మాణం పూర్తి చేసేందుకు  కార్యాచరణ తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ చేపట్టనిరీతిలో పేదలందరికి  ఉచితంగా ఇంటి స్దలంతోపాటు ఇల్లు నిర్మాణం చేపట్టి చిట్టచివరి లబ్దిదారునివరకు అందించడం  జరుగుతోందన్నారు. గత 20 సంవత్సరాలుగా తిరుగుతున్నా  ఏన్నాడూ ఊహించనివిధంగా ఇండ్లు స్దలాలు నిర్మాణాలు మంజూరు కావడం విశేషమన్నారు.సిఎం వారి ద్వారా దేవుడు కరుణించి ఇండ్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ రోజున ఎంతో పారదర్శకంగా  పార్టీలకతీతంగా అర్హత కల్గిన వారందరూ ఇండ్లు పొందుతున్నారన్నారు. లబ్దిదారులు మనస్పులో వున్నా భావాలను వ్యక్తపరుస్తూ ఇంటి నిర్మాణాలు దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. అదేవిధంగా ఎన్నడూ లేనివిధంగా మౌలికసదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కాలనీలలో అన్నిరకాలు వసతులు పూర్తిస్దాయిలో కల్పించడం జరుగుతుందన్నారు. సుమారు 30.75 లక్షలు మంది లబ్దిదారులుకు ఇండ్లు నిర్మితమవుతాయన్నారు. అద్దె ఇండ్ల ఎవ్వరూ ఉండాల్సిన పరిస్దితి ఇకపై ఉండదన్నారు. దేశవ్యాప్తంగా ఇండ్ల పంపిణీ విషయమై చర్చ మీడియాలో జరుగుతోందన్నారు.టిడ్కో ఇల్లు కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తు ఇండ్ల విలువ పెరుగుతుందన్నారు. రైతు పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి ఆండగా నిలవాలన్నారు.  మోరంపూడి ప్లైఒవరు రివైజ్డు అంచనాలు కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. మూడు బ్లాక్లులుగా విభజించి అబివృద్ది పర్చనున్నట్లు తెలిపారు. ఉండ్రాజవరం, జోన్నాడ, దివాన్‌చెరువు, కడియపులంక ప్లైఒవర్లు మంజూరు కాబడ్డాయని,  లాలాచెరువు మోరంపూడి ప్లైఒవర్లు మంజూరు కావాల్సివుందన్నారు. సింగిల్‌ ‌ప్మాకేజీ విధానంలో నిర్మాణపనులు పూర్తిచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొయ్యలగూడెంనుంచి జీలుగుమిల్లి వరకు రోడ్డు అబివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.  రూ 185 కోట్లు నిదులు మంజూరు అయ్యాయన్నారు. ఇఎస్‌ఐ ఆసుపత్రికి మరో రూ 98 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రదానమంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన కార్యక్రమం క్రింద రాష్ట్రానికి కీటీ క్రింద 3 వేలు కిలోమీటర్లుకు నిధులు ఇవ్వగా దీనికి అదనంగా తూర్పుగోదావరి జిల్లాలో 75 కిలోమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 123 కిలోమీటరు మేర రోడ్లు అభివృద్ది కార్యాచరణ తీసుకోవడం జరిగిందన్నారు.   గామన్‌ ‌రోడ్డుకు ఒక వైపు రోడ్లు అభివృద్దిపనులు పూర్తి కావచ్చాయని, రెండవ వైపు మార్చి 31 నాటికల్లా పూర్తిచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతొందన్నారు. భవిష్యత్తులో పెద్దగా మరమ్మత్తులకు ఆస్కారము లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ 13 కోట్లు వెచ్చించామని, మరో రూ 10 కోట్లు బ్యాంకు రుణంగా తెచ్చి పటిష్టంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారదికి వైఎస్‌ఆర్‌ ‌వారదిగా నామకరణం చేసి వైఎస్‌ఆర్‌ ‌విగ్రహాం ఏర్పాటు చేస్తామన్నారు. స్దానిక రైల్వేస్టేష్టన్‌ ఉభయగోదావరి జిల్లాల ప్రజల కల అని, తూర్పు వైపు ప్లాటుపారం 4,5, అభివృద్దికి రూ 12 కోట్లు మంజూరు కాగా, పోల్‌ ‌యార్టును కడియంకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఎక్సలేటరుతో 4,5, ప్లాట్‌ ‌పారాలు అభివృద్దికి పక్కా ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు. రైల్వే సేష్టన్‌ ‌మెయిన్‌రోడ్డు అభివృద్దికి 22 అడుగులు వెడల్సుతో స్దానిక జూనియరు కళాశాలనుంచి ఐదుబండ్లమార్కెట్‌ ‌వరకు అభివృద్ది పర్చేందుకు రూ 11 కోట్లకు పరిపాలనామోదం రావడం జరిగిందన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో రూ 12 కోట్లతో స్డేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.  రానున్న ప్యాకేజీలో రాజమహేంద్రవరం స్మార్ట్ ‌సిటీగా మార్చేందుకు అనుమతులు తీసుకురవడం జరుగుతుందన్నారు. జలశక్తి మిషన్‌ ‌క్రింద ఎన్‌ఆర్‌సిడి ద్వారా రూ 136 కోట్లతో గోదావరి మిషన్‌ ‌రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, రూరల్‌ ‌సమన్వయకర్త ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్‌, ‌పోలు విజయలక్ష్మీ, అఖిల గాండ్ల తెలుకుల కార్పోరేషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌సంకిస భవానీ ప్రియ చందన నాగేశ్వర్‌ ‌తదితరులు పాల్గోన్నారు.