ఆ వంతెనల తనిఖీ బాధ్యత చెన్నై కంపెనీకే..


Ens Balu
2
Visakhapatnam
2020-12-31 14:52:00

విశాఖపట్నం పోర్టు ట్రస్టు  నిర్వహణ పరిధిలో ఉన్న నాలుగు వంతెనల సామర్ధ్య పరీక్షలను నిర్వహించే బాధ్యతలను చెన్నైకి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIRSERC) సంస్ధకు పోర్టు అప్పగించింది. వంతెనలపై లోడ్ ఇతర అంశాలకు సంబంధించిన క్షేత్ర స్ధాయి పరీక్షలు నిర్వహించిన సదరు సంస్ధ నెహ్రూ సెంటినరీ వంతెన యొక్క బరువును మోయగలిగి సామర్ధ్యం కొంత మేర తగ్గినట్లు ధృవీకరించింది. ఈ వంతెనపై నుంచి కేవలం లైట్ మోటార్ వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించింది. దీని ప్రకారం నెహ్రూ సెంటినరీ వంతెన పై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిశేధిస్తూ విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని సూచించింది. దీని ప్రకారం లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాల రాకాపోకోలను  ఈ వంతెనపై నుంచి నడవడం నిషేధిస్తున్నట్లు పోర్టు వెల్లడించింది.  ఈ వంతెనపై కేవలం లైట్ మోటార్ వాహనాలు మాత్రమే అనుమతిస్తామని పోర్టు ప్రకటించింది. ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు నాల్కో ,సౌత్ వెస్ట్ గేటు వైపు నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు నుంచి నగరంలోకి అలాగే నగరంలో నుంచి వచ్చే వాహనాలు నాల్కో సౌత్ వెస్ట్ కాబిన్ నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా బిరాంప్ ఓల్డ్ అంబేద్గర్ మార్గం గుండా వెళ్లాలని సూచించారు. నగరవాసులు ఈ మార్పులను గమనించాలని బ్రిడ్జికి సంబంధించిన మరమ్మత్తులు పూర్తి చేసి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే వంతెనపై రాకపోకలు అనుమతిస్తామని అప్పటి వరకూ నగర ప్రజలు సహకరించాలని పోర్టు యాజమాన్యం విజ్ఞ ప్తి చేసింది. ఈసమాచారాన్ని ఇప్పటికే ఈమార్గంలో ఉన్న నేవీ, హెచ్ ఎస్ ఎల్, హెచ్ పిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్, ఈఐపిసిఎల్, సిఎప్ ఎల్, విసిటిపి ఎల్, జీవీఎంసీ, పోలీస్ కమీషనర్, ఎపిఎస్ ఆర్ఠీసీ మరియూ జిల్లా యంత్రాంగానికి పోర్టు అధికారులు అందజేశారు.