కెజిహెచ్ లోఉద్యోగాలకు ఆగస్టు 14 నుంచి కౌన్సిలింగ్


Ens Balu
2
Visakhapatnam
2020-08-11 19:48:28

విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో పారామెడికల్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టు జాబితాను కెజిహెచ్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు సూపరింటెండెంట్ డా.పివి.సుధాకర్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్ధులు వారి మెరిట్ జాబితాను  http://www.kghvisakhapatnam.org లో చూసుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు 12వ తేది నుంచి 13వ తేది సాయంత్రం 5 గంటలకు మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్ధులకు ఈనెల 14 నుంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ కి వచ్చే అభ్యర్ధులు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాటికి సంబంధించిన జెరాక్సు కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటోలను రెడీచేసుకోవాలని ఆయన వివరించారు.
సిఫార్సు