నాడు-నేడు పనులు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
3
Tirupati
2020-12-31 16:57:10
చిత్లూరు జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, నేటితో పూర్తికావలసిన పనులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సంక్రాంతి నాటికి వందశాతం పూర్తి కావాలని జెసి (అభివృద్ది) వీరబ్రహ్మం సూచించారు. గురువారం ఉదయం చంద్రగిరి, తిరుపతి నియోజవర్గాలు, మద్యాహ్నం శ్రీకాళహస్తి నియోజవర్గ పాఠశాలల మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాలు సంబంధిత అధికారులతో నాడు – నేడు పనులపై జాయింట్ కలెక్టర్ (డి) సమీక్షించారు. జెసి మాట్లాడుతూ నాడు – నేడు ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం దీన్ని గుర్తించి ప్రధానోపాధ్యాలు తమ పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడు పనులు జాప్యం లేకుండా సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి రావలసిన ఆర్.ఓ.సిస్టమ్, శానిటరీ ఐటంస్, ఫ్యాన్లు ఈ మొదటి వారంలో అందనున్నాయని ఆలోపు పెండిగ్ వున్న పనులు పూర్తిచేస్తే వీటిని త్వరగా అమర్చగలుగుతారని సూచించారు.
పాఠశాలవారిగా సమీక్ష నిర్వహించగా పూర్తి అయిన పనులకు సంబంధించి ఫోటోలు అప్ లోడ్ కూడా ఆలస్యం అవుతుండటంతో సి.ఆర్.పి.లు వెంటనే పూర్తిచేయాలని, అప్ లోడ్ ఎప్పటికప్పుడు చేస్తేనే కదా పూర్తి వివరాలు తెలుస్తాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహణ చేస్తున్నామని జనవరి 2 న సత్యవేడు, నగరి, జిడి నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, తేదీ 3 న పలమనేరు, కుప్పం,మదనపల్లి తంబళ్లపల్లి , తేదీ 4 న పీలేరు, పుంగనూరు నియోజక వర్గాలు సమీక్ష వుంటుందని తెలిపారు. ఈ సమీక్షలో డి వై ఈ ఓ విజయేంద్ర , ఎ.ఎస్.ఓ. జగన్నాధం, ఎ.పి.సి .వెంకట రమణ రెడ్డి, ఎ.ఏం.ఓ. దామోధర్ రెడ్డి, సి.ఎం.ఓ. గుణశేఖర్ రెడ్డి, ఎం.ఈ.ఓ.లు సత్యనారాయణ , బాలసుబ్రమణ్యం, లలితకుమారి, బాబ్జి, హేమలత , పాఠశాలల ప్రధానోపాధ్యాలు , అధికారులు పాల్గొన్నారు.