జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
2
Visakhapatnam
2020-12-31 16:58:46
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు . గురువారం సీతమ్మదార వీజెఎఫ్ వినోద వేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2020-21 నూతన సంవత్సరం డైరీ , క్యాలెండర్ ఆవిష్కరణలో ముఖ్య అతిధిగా పాల్గొని వాసుపల్లి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రతినిధులుగా తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, కోవిడ్ -19 లో వారు అందించిన సేవలు మరుపురానివన్నారు. గౌరవ అతిధులుగా హాజరైన డీసీపీ వి.సురేష్ బాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహకారం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం అధ్భుతంగా పనిచేస్తుందన్నారు. మూడున్నర దశాబ్దాల చరిత్రలో వీజెఎఫ్ ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. సంక్షేమమే లక్ష్యంగా వీజేఎఫ్ పనిచేయడం, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేయడం, అన్ని పండుగలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో కూడా సమాజాభివృద్ధిలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుందని, అందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఏసీబీ డీఎస్పీ రంగరాజు మాట్లాడుతూ, నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. వారికి నూతన సంవత్సరంలో శుభం కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటు పడాలన్నారు. పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజు మాట్లాడుతూ, జర్నలిస్టుల నూతన సంవత్సరం వేడుకల్లో తాము కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉ ందన్నారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అందిస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ, అందరి సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులు కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని 9 రకాల సామాగ్రితో సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు ప్రత్యేక కిట్ బ్యాగ్లను అందజేశామన్నారు.
ఈ ఏడాది జర్నలిస్టులకు స్వీట్స్ ను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అందజేయగా, డైరీలను పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజు పంపించారన్నారు. కార్యక్రమంలో అతిధులందరిని ఘనంగా సత్కరించగా , స్కూల్ ఆఫ్ దియేటర్ ఆర్ట్స్ సౌజన్యంతో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ కెనడీ , వీజెఎఫ్ జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పి.ఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు గిరిబాబు, దివాకర్ , ఈశ్వరరావు, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, వరలక్ష్మి, శేఖర మంత్రి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.