పోటీపరీక్షలపై అవగాహన ఉండాలి..
Ens Balu
2
Srikakulam
2020-12-31 20:22:00
విద్యార్ధులు పాఠ్యాంశాలతో పాటు పోటీ పరీక్షలపై అవగాహన కలిగి వుండాలని జిల్ల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందచేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిగ్రీ చదువుకుంటూనే పోటీ పరీక్షలపై అవగాహన కలిగి వుండాలన్నారు. డిగ్రీ అనంతరం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. పరీక్షలకు సిధ్ధం కావాలన్నారు. ఇందుకు పోటీ పరీక్షల పుస్తకాలు దోహదపడాతయని తెలిపారు. నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. తాను మధ్యతరగతికి చెందిన వాడినని, పట్టుదలతో ఐ.ఎ.ఎస్. ను సాధించడం జరిగిందని తెలిపారు. ప్రతీ కలేజీకి ఎన్.సి.ఇ.ఆర్.టి. మెటీరియల్ ను అందిస్తున్నామని, తానే స్వయంగా పుస్తకాలను సెలక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సెక్రటేరియట్ పరీక్షలలో డిజిటల్ అసిస్టెంట్లు, ఏనిమల్ హస్బెండ్రీ పోస్టులు చాలా ఖాళీగా వున్నాయని, పోటీ పరీక్షలపై అవగాహన లేకపోవడం వలన ఈ విధంగా జరిగిందని తెలిపారు.
జెనరల్ నాలెడ్జి పై అవగాహన కలిగి వుండాలని తెలిపారు. బ్యాంకులలో చాలా పోస్టులు ఖాళీగా వున్నాయని తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు ఇతర నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు. 20 నుండి 30 సం.లలోపు వయస్సు చాలా కీలకమని, ఈ సమయంలోనే భవిష్యత్తుకు పునాదులు వేయాలని తెలిపారు. ప్రతీ రోజు ఇంగ్లీషు న్యూస్ పేపర్లను చదవడం ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుందన్నారు. కాలేజీలో ప్రతీ శని, ఆదివారాలలో మంచి నిపుణులతో పోటీ పరీక్షలపై తర్ఫీదును ఇవ్వడానకి యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయని, జిల్లాలో మంచి పర్యాటక స్థలాలు, సంస్కృతి, తదితర అంశాలపై యూ ట్యూబ్ నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు. వారికి అన్ని రకాలుగా సాయం అందించడానికి సిధ్ధంగా వున్నామని తెలిపారు. విద్యార్ధులు పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగ పరచుకుని మంచి ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందరికీ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్ధులకు అందచేసారు.
ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి.ఇ.ఓ. శ్రీనివాసరావు, మేనేజరు ప్రసాదరావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మి, వైస్-ప్రిన్సిపాల్ జి.జనార్ధన్ నాయుడు, జె.కె.సి. కో-ఆర్డినేటర్ డా.పైడితల్లి, ఐ.ఓ.క్యూ. ఎ.సి. కో-ఆర్డినేటర్ యు.వర్మ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.సత్యన్నారాయణ, గేదెల ఇందిరా ప్రసాద్, కాలేజీ అధ్యాపకులు, విద్యార్ధినీవిద్యార్ధులు పాల్గొన్నారు.