గ్రంధాలయ సామాగ్రి కొనుగోలుకు ఆమోదం..


Ens Balu
3
Srikakulam
2020-12-31 20:25:12

గ్రంథాలయాలకు  అవసరమగు  వస్తు సామగ్రి కొనుగోలుకు ఆమోదించడం జరిగిందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. గురువారం సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం  జరిగింది.  ఈ సందర్భంగా జె.సి. మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ ఛార్జి కె.శ్రీనివాసులు మాట్లాడుతూ, గ్రంధాలయాలలో మంచి పుస్తకాలను అందుబాటులో వుంచడంతో పాటు పాఠకులు చదువుకోవడానికి సౌకర్యాలు కలుగచేయాలని, లైబ్రరీలలో మౌలిక సదుపాయాలను కలుగచేయాలని అన్నారు. ఇందు నిమిత్తం  గ్రంథాలయాలకు అవసరమగు  పుస్తకాలను, ఫర్నిచర్ కొనుగోలుకు ఆమోదించినట్లు తెలిపారు.  జిల్లాలో కేంద్ర గ్రంథాయలయంతో పాటు 44 శాఖా గ్రంథాలయాలు, 5 గ్రామీణ గ్రంథాలయాలకు గత మూడు సంవత్సరాలుగా పాఠకులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసియుండలేదని తెలిపారు.  ఈ ఆర్ధిక సం.లో జిల్లా కేంద్రగ్రంధాలయంతో పాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంధాలయాలకు రూ.40 లక్షలతో పుస్తకాలను కొనుగోలు చేయుటకు ఆమోదించినట్లు తెలిపారు. అదే విధంగా  2020-21 సం.నికి గాను  రూ. 5 లక్షలతో ఫర్నిచర్ కొనుగోలుకు ఆమోదించినట్లు తెలిపారు.   జిల్లా కేంద్ర గ్రంధాలయం  మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయానికి రూ. 1.50 లక్షలతో కంప్యూటర్లు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడమైనదని, రూ. 19 లక్షలతో కేంద్ర గ్రంధాలయం ప్రహారీ గోడ నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టుటకు ఆమోదించడమైనట్లు ఆయన తెలిపారు.   విద్యార్ధులకు అవసరమగు కాంపిటీటివ్ బుక్స్, రిపరెన్స్ బుక్స్ అందుబాటులో వుంచాలని తెలిపారు. పుస్తకాలను అమర్చడానికి బుక్ రాక్స్, పాఠకులకు సదుపాయం కలుగచేసేందుకు గాను రీడింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ,  జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, గ్రంధాలయ సంస్ధ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.