351 నూతన అక్రిడిటేషన్లు మంజూరు..
Ens Balu
2
Srikakulam
2020-12-31 20:29:07
శ్రీకాకుళం జిల్లాలో నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి (డి.ఎం.ఏ.సి) నిర్ణయించింది. డి.ఎం.ఏ.సి సమావేశం జిల్లా కలెక్టర్ జె నివాస్ అధ్యక్షతన గురు వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. జిల్లా, మండల అక్రిడిటేషన్లకు వివిధ మీడియా సంస్ధలకు చెందిన 1,455 మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించారు. వీటిలో ప్రభుత్వ ఉత్తర్వులు 142కు అనుగుణంగా కేవలం 19 మంది సమర్పించగా, 351 మంది కొన్ని పత్రాలు మాన్యువల్ గా సమర్పించడం జరిగింది. పూర్తి స్ధాయిలో సమర్పించిన దరఖాస్తులను అర్హత మేరకు మంజూరు చేయడం జరిగింది. మాన్యువల్ గా సమర్పించిన వాటిపై సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ నుంచి వివరాలు పొందిన మేరకు జారీ చేయుటకు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నివాస్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధికి మీడియా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఆర్.టి.సి డిప్యూటి సి.టి.ఎం జి.వరలక్ష్మి, కార్మిక శాఖ సహాయ కార్మిక శాఖ అధికారి బి.కొండల రావు తదితరులు పాల్గొన్నారు.