ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పాలి..


Ens Balu
6
Srikakulam
2020-12-31 20:30:36

పిల్లలకు ఉన్నత ప్రమాణాలను అందించడంలో, సత్ప్రవర్తన నేర్పడంలో  తలితండ్రుల పాత్ర చాలా కీలకం అని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన " యువత రేపటి భవిష్యత్ కొరకు నేటి సంసిద్ధత " స్వీయ సాధికారత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సమాజంలో పలు అంశాలపై స్వీయ అవగాహన కలిగి ఉన్నప్పుడు విద్యార్థి దశలో పెట్టుకున్న లక్ష్యాలను సాధించిన విజయాలును పొందగలరు అని పేర్కొన్నారు. 20సం.ల నుంచి 30సం.ల వయసు గల యువతీ యువకులకు సరియైన స్వీయ అవగాహన లేకపోవడం వల్ల చెడు అలవాట్లుకు బానిసై సాదించాకలేకపోతున్నారని చెప్పారు. తద్వారా యువతీ, యువకులకు చట్టం పట్ల అవగాహన లేకపోవడం వలన  నేర  వ్యవహారాల్లో చిక్కుకొని దురదృష్టవసాత్తు దోషులుగా మారుతున్నారన్నారని వివరించారు. కావున తల్లితండ్రులు పిల్లలుకున్న సమస్యలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి మార్గాలను చూపించి వారికున్న ఒత్తిడులను తగ్గించాలని పేర్కొన్నారు.  అదేవిధంగా పిల్లలు కూడా మీకు ఎంత పెద్ద సమస్య ఉన్న తల్లితండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు పాలుపంచుకొని ప్రశాంత వాతావరణంలో సులువుగా సమస్యలను పరిష్కరించకొని ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని యస్.పి స్పష్టం చేసారు. తమ పిల్లలు ఏమి చేస్తున్నారన్న విషయాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని, వక్రమార్గంలో వెళ్ళే వారిని సన్మార్గంలో పెట్టి, వారికి దిశా నిర్దేశం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సన్నిహితంగా, ప్రేమతో మెలగడం వలన పిల్లలు తప్పు దారుల్లో నడిచే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.పిల్లలు తమ ఇబ్బందులను,అభిప్రాయాలను స్వేచ్ఛగా వారి తల్లిదండ్రులతో పంచుకొనే అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విలువైన  సమయంను వృధా చేసుకోకుండా మన చుట్టూ ఉన్న అవకాశాలును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రతి రోజు దినపత్రికలో ప్రచురించబడిన ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పఠించి  సమాజంలో జరుగుతున్న పరిణామాలుపై అవగాహన చేసుకోవాలన్నారు.                       ఈ కార్యక్రమంలో ఏ.యస్.పి పి.సోమశేఖర్, టి.పి.విఠలేశ్వరరావు, డి.యస్.పి ( ట్రాఫిక్ ) సిహెచ్.జి.వి.ప్రసాద్, డి.యస్.పి ఎం.మహేంద్ర, డి.యస్.పి ( దిశ ) వాసుదేవరావు, సి.ఐలు అంబేద్కర్, పి.వి.రమణ , రిమ్స్ ఫిజియాలజీ వైద్యులు డా.అనురాధ, డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం హెచ్.ఓ.డి కావ్యజ్యోత్న, జి.యం.ఆర్. కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తుమ్మలపల్లి గీతమ్మ, గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.