ప్రజలకు పూర్తిస్థాయిలలో సేవలందాలి..


Ens Balu
5
Visakhapatnam
2020-12-31 20:36:21

జివిఎంసి పరిధిలోని నాల్గవ, ఐదవ జోన్ లో 47, 63, 64వ వార్డులలో జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు పర్యటించి, 47వ వార్డు కోరమండల్ గేటు, జనతా కాలనీ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ముఖ్యంగా ప్రాధమిక వైద్యశాలను సందర్శించి మందులు లభ్యత, సిబ్బంది హాజరు, రోగుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వార్డు సచివాలయమును పరిశీలించి సిబ్బంది యొక్క హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీలను తనిఖీ చేసారు. తదుపరి 63వ వార్డులోని కణితిలోని రోడ్లు, కాలువలను పరిశీలించి, తడి-పొడి చెత్తను సేకరించే పద్దతిని పారిశుద్ధ్య కార్మీకులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లను, కాలువలను శుభ్రంచేసి చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. 64వ వార్డులో గాజువాక తదితర ప్రాంతాలలో పరిశీలించారు. ప్రజా మరుగుదొడ్లను పరిశీలించి, వాటి నిర్వహణను అడిగితెలుసుకున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 47, 63, 64వ వార్డులలో శానిటరీ ఇన్ స్పెక్టర్లు, ఆయా వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.