శనివారం కోవిడ్ ట్రైల్ రన్..
Ens Balu
2
Srikakulam
2021-01-01 16:42:24
కోవిడ్ వాక్సిన్ ట్రైయల్ రన్ ను శనివారం జిల్లాలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశం జరిగింది. వాక్సిన్ వేయుటకు ముందుగా విధి విధానాలు పక్కాగా నిర్వహించుటకు ఈ ట్రైయల్ రన్ ను నిర్వహిస్తున్నారు. ట్రైయల్ రన్ ను శని వారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రాగోలు జెమ్స్ ఆసుపత్రి, పాలకొండ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించనున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోల్డ్ చైన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. కోల్డు చైన్ యూనిట్ నుండి వాక్సిన్ ను రవాణా చేసే విధానం, వాక్సిన్ వేసే ప్రదేశం వద్ద వాటిని భద్రపరిచే విధానం, బందోబస్తు విధానం పక్కాగా నిర్వహించాలని అన్నారు. వాక్సిన్ వేసే కేంద్రంలో వాక్సిన్ వేసే గది, వేచి ఉంటే గది, అబ్జర్వేషన్ గది ఏర్పాటు చేయాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద ఎన్నికల పోలింగు కేంద్రం వద్ద విధంగానే అన్ని చర్యలు పక్కాగా జరగాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్దకు వాక్సిన్ జాబితాలో (ఓటరు జాబితా విధంగా) ఉన్న వ్యక్తులు మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వాక్సిన్ కు వచ్చే వ్యక్తి తగిన గుర్తింపు కార్డు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన తీసుకునే వ్యక్తికి తగిన మార్కు పెట్టాలని అన్నారు. వారిని వాక్సిన అనంతరం అబ్జర్వేషన్ గదిలో ఉంచి కనీసం 30 నిమిషాలు పరిశీలించాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద అంబులెన్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి వాక్సిన్ ట్రైయల్ రన్ ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వాక్సిన్ కేంద్రంలో బయో వేస్ట్ డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రం వద్ద విధి విధానాలు, మార్గాలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశెంలో వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, అదనపు పోలీసు సూపరింటిండెంట్ పి.సోమశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, డి.ఎస్.పి మహేంద్ర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, ఇపిడిసిఎల్ ఎస్.ఇ ఎన్.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగర పాలక సంస్ధ ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ తదితరులు పాల్గొన్నారు.