ఏయూలో నూతన సంవత్సర సందడి..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2021-01-01 17:53:28
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర సందడి నెలకొంది. ఉదయం నుంచి వర్సిటీ అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు విసిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఆచార్య జేమ్స్ స్టీఫెన్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వీసీ ప్రసాద రెడ్డి...
రాజ్యసభ సభ్యులు (ఎం.పి) వి.విజయసాయి రెడ్డిని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.