ఆరోగ్యశ్రీలో అధనంగా 683 వ్యాధులు..
Ens Balu
1
Srikakulam
2021-01-02 17:22:48
ఆరోగ్యశ్రీ ఆసరా పథకంలో అదనంగా 683 వ్యాధులను చేర్చడం జరిగిందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు శనివారం తెలియచేసారు. రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా ప్రస్తుతం 836 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ 836 వ్యాధులతో పాటు అదనంగా 683 వ్యాధులను జతపరచి మొత్తం 1519 వ్యాధులకు ఇకపై ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని జె.సి. తెలిపారు. ఈ పథకం ద్వారా రోజుకు రూ.225ల చొ.న గరిష్టంగా నెలకు రూ.5,000 లను చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆరోగ్య మిత్రలకు సరైన బ్యాంకు ఖాతా వివరాలను తెలియపరచాలని, ఆరోగ్య శ్రీ ఆసరా పథకాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.