16 మంది డిజిటల్ అసిస్టెంట్లకు పోస్టింగ్..
Ens Balu
2
Vizianagaram
2021-01-02 17:27:53
విజయనగరం జిల్లాలోని సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించిన 16 మంది గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్లకు, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్ శనివారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ప్రతీఒక్కరూ చిత్తశుద్దితో, అంకితభావంతో పనిచేసి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. మరోవైపు మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మొదటివిడత ఎంపిక చేసిన గ్రామ పంచాయితీలను ఓడిఎఫ్ ప్లస్ గ్రామ పంచాయితీలుగా ప్రకటించేందుకు కరసత్తు ప్రారంభమయ్యింది. దీనిలో భాగంగా జిల్లా పంచాయితీ అధికారి సునీల్ రాజ్‌కుమార్, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయితీ విస్తరణాధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారులు, పంచాయితీ కార్యదర్శులతో శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓడిఎఫ్ ప్లస్‌కు అనుసరించవలసిన విధివిధానాలను ఈ సందర్భంగా డిపిఓ వివరించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కో-ఆర్డినేటర్ డి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.