జగనన్న తోడులో మనమే టాప్..
Ens Balu
2
Anantapur
2021-01-02 18:36:11
అనంతపురం జిల్లాలో చిరు వ్యాపారులు మరియు సంప్రదాయ వృత్తిదారులను మైక్రో ఫైనాన్స్ ఊబి నుంచి రక్షించేందుకు 2019 నవంబరు 25 నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రరిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న తోడు పథకం నిర్వహణలో జిల్లా టాప్ లో నిలిచిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న తోడుకు అర్హులుగా గుర్తించిన 25691 మందిలో 25035 మందికి రూ.10000 లను సున్నా వడ్డీకి అందించామన్నారు. మిగిలిన 656 మందికి వెంటనే సున్నా వడ్డీకే రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 97.45 శాతం మంది అర్హులకు రుణాలు అందించి తోడందించడంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి 17269 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 7766 లబ్ధిదారులున్నారని తెలిపారు. గ్రామాలలో 226 మంది, పట్టణాలలో 430 మందికి ఇంకా 'తోడు' అందాల్సి ఉందన్నారు.
తోపుడు బండ్లు, గంపల్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, బొమ్మల తయారీ దారుల వంటి వర్గాలకు వారికి జగనన్న తోడు పథకం అండగా నిలిచిందని కలెక్టర్ తెలిపారు. గతంలో ఐదు రూపాయలు, పది రూపాయల వడ్డీకి తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారులు అప్పుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు, పేద ప్రజలకు 'జగనన్న తోడు' మేలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే చిరు వ్యాపారులకోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పీఎం స్వానిధి పథకం నిర్వహణలోనూ జిల్లా ముందుందన్నారు. పీఎం స్వానిధి ద్వారా 8662 మంది చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణం అందించామన్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంపల్లో, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకునే వారూ మరియు ఇతర సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి రూ.10000లు సున్నా వడ్డీకి రుణం లభిస్తుందని, పీఎం స్వానిధి పథకం పట్టణాలలోని చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకి రూ.10000 లు ఋణంగా లభిస్తుందని,స్వానిధి పథకంలో డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా వడ్డీ కంటే ఎక్కువ మొత్తాన్ని రుణ గ్రహీతలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు.