ప్రజల ముంగిట సేవలకే సచివాలయాలు..
Ens Balu
2
Machilipatnam
2021-01-02 18:39:31
భారత దేశ చరిత్రలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ సొంతమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ప్రజాసేవకులమే అని గుర్తించుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజుపేట 37 వ డివిజన్ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 36 వ డివిజన్ సచివాలయంలో 37 వ డివిజన్ సచివాలయ కార్యకలాపాలు నిర్వహించేవారని, ప్రజలకు మేలైన సౌకర్యాలు ఒనగూరాలంటే 37 వ డివిజన్ కు ప్రత్యేక సచివాలయం ఉండాలని ఒక భవనంను అద్దెకు తీసుకొన్నట్లు తెలిపారు. వ్యవస్థలోకి మార్పు తీసుకువచ్చే విధంగా పరిపాలనలో అవినీతి ఎక్కడా లేకుండా చేయాలనే తపనతో, విపక్షకు తావులేకుండా చేసిన ప్రయత్నమే ఈ గ్రామ సచివాలయమని మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఏ సేవ అయినా కూడా పూర్తిగా, పారదర్శకంగా, వివక్షకు తావు లేకుండా వాలింటర్లు సేవలందిస్తారని అర్హత ఉన్న వారికి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని 72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అర్హులకు అందజేస్తామని మంత్రి వివరించారు. ఆషా బేగం అనే మహిళ తనకు జగనన్న చేయిత పథకం పడలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా సంబంధిత వాలింటర్ ను పిలిచి ఆమెకు ఎందుకు మంజారు కాలేదో పూర్తి వివరాలు తెలుసుకొని తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే అంకెం నాంచారయ్య తనకు ఇళ్ల స్థలం రాలేదని మంత్రికి తెలిపారు. పిండాల దొడ్డిలో చెత్తాచెదారాలు పడవేయడంతో ఆ ప్రాంతం అంతా అపరిశుభ్రంగా కనబడతుందని కొందరు మహిళలు మంత్రికి తెలిపారు. తనకు బోదకాలు వ్యాధి సోకిందని తనకు వికలాంగుల పించన్ వచ్చే అవకాశముందా పెనుబోతు సూర్యకుమారి అనే వృద్ధురాలు మంత్రిని అభ్యర్ధించింది.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ కె . శివరామకృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మునిసిపల్ ఎం ఇ త్రినాధ్ బాబు, మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్ ,పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాంబాబు, 37 వ డివిజన్ పార్టీ ఇంచార్జ్ ఐనం తాతారావు, నూకల ప్రసాద్, జవ్వాది రాంబాబు, వివిధ డివిజన్ ఇంచార్జ్ లు రాంప్రసాద్ , గూడవల్లి నాగరాజు, మహమ్మద్ రఫీ, బూరుగ రామారావు, కాగిత జవహర్ ( బున్నీ ) తదితరులు పాల్గొన్నారు.