9న నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన..
Ens Balu
1
Nellore
2021-01-02 19:15:54
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుందనున పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికాకులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయములో జిల్లా కలెక్టర్ శ్రీ కె. వి. ఎన్ చక్రధర్ బాబు ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం యేర్పాట్లు గురించి జిల్లా అధికారులతో సమావేశo నిర్వహించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ఈ నెల 9వ తేదీన అమ్మవొడి పధకాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో ప్రారంబించనున్నoధున, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగ పర్యటనకు సoభందించిన యేర్పాట్లు ఈ నేల 8వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. పర్యతంకు సంబందించిన యేర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అధికారులందరు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించిన యేర్పాట్లలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా హరేందిర ప్రసాద్, డా. ప్రభాకర్ రెడ్డి , డీ ఆర్ వొ శ్రీ నాగేశ్వర రావు, ఆర్ డీ వొ శ్రీ హుస్సేన్ సాహెబ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ . దినేష్ కుమార్ , అడిషనల్ ఎస్ పి . శ్రీమతి నాగరత్నం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.