నాబార్డ్ పనులను వేగవంతం చేయాలి..
Ens Balu
3
Kakinada
2021-01-02 19:21:00
తూర్పుగోదావరి జిల్లాలో నాబార్డ్ సంస్థ ద్వారా చేపట్టే వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి జిల్లాస్థాయి నాబార్డ్ గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పై జూమ్ వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటింగ్ ఎంటీటీస్( Executing Entities), వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామీణ మౌలిక సదుపాయాలు కింద చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. తదుపరి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసి నాబార్డుకు అందించాలని కలెక్టర్ తెలిపారు. నాబార్డు సంస్థ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు కింద వివిధ ప్రాంతాల్లో ప్రారంభించిన ప్రాజెక్టుల పనుల వివరాలు, ఇప్పటికీ జిల్లాలో ప్రారంభంకాని ప్రాజెక్టులు వివరాలు నాబార్డ్ అధికారులకు సమర్పించాలన్నారు. ఆయా సంస్థలు చేపట్టిన ఆర్ఐడిప్ ప్రాజెక్టుల తాజా స్థితి,పనితీరును ప్రాజెక్టుల వారిగా కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ వీసీ లో నాబార్డు డిడి ఎం డా.వై సోము నాయుడు, ఐసిడిఎస్ పిడి డి.పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఎన్ టి. శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి. గాయత్రిదేవి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్, రోడ్డు భవనాల, పంచాయతీ రాజ్, పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.