మళ్లీ మళ్లీ రాని సొంతింటి పండుగ ఇది..


Ens Balu
3
Gudibanda
2021-01-02 19:25:03

పేద వారికి, అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, అందులో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు" పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి, కుంచిత వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. మడకశిర నియోజకవర్గంలో 12,800 మందికి ఇంటి పట్టాలు అందిస్తున్నామని, బాత్రూంలు, వంట రూమ్, హాల్, వరండా, బెడ్రూమ్, కిటికీలు, వెంటిలేటర్లు, ఫ్యాన్, ట్యూబ్ లైట్లతో సహా ఇల్లును ప్రభుత్వం నిర్మించి ఇస్తోందన్నారు. ప్రతి లేఔట్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారుల వివరాలను, ఎవరికీ ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఇచ్చారు అనే వివరాలను పొందుపరిచామని, ప్రతి లేఔట్ ను ఇంటిగ్రేటెడ్ కాలనీలుగా తీర్చిదిద్దుతాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1045 లేఔట్ కాలనీలలో 3 లక్షల మొక్కలను నాటించామన్నారు. ప్రతి లేఔట్ ను అన్ని రకాల అభివృద్ధి చేసి పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  పాదయాత్ర హామీని అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి - ఎమ్మెల్యే తిప్పేస్వామి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారని  ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని సంకల్పించి ఇల్లు మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశారని, 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 50,940 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. పేదలందరికీ ఇల్లు కింద పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికి ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ముందుండి నడిపించారని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందువరుసలో ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే హేమావతి చెరువుకు నీటి సరఫరాకు అవసరమైన కాలువ తవ్వకం పనులకు అనుమతి ఇవ్వాలని, హేమావతి చెరువుకు నీరు వెళ్లేందుకు కాలువకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే గుడిబండ పీహెచ్సీకి వెంటనే డిప్యుటేషన్ కింద ఒక డాక్టర్ ను నియమిస్తామన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కుంచిత వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు కింద ఇల్లు లేని నిరుపేదలు అందరికీ పండుగ రోజని, ప్రైవేట్ లేఔట్ లకి దీటుగా ప్రభుత్వ లేఔట్ ను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. గుడిబండ మండలం లో 21 లేఔట్ లను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కుంచిత వక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నేత్రావతి, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి,  డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, ఏపీ డి లక్ష్మీనారాయణ, హౌసింగ్ ఏఈ పెంచలయ్య, తహశీల్దార్ మహబూబ్ పీరా, ఎంపీడీవో నాగేంద్ర కుమార్, ఈ ఓఆర్డీ నాగరాజు నాయక్, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.