ఆన్ లైన్ క్లాసులకు అమ్మఒడి లింకు పెట్టొద్దు..
Ens Balu
3
Machilipatnam
2021-01-02 19:37:51
‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత జనవరి 9వ తేదీన తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేయనుందని ఆ డబ్బులు పడక ముందే కొందరు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు చెప్పినందుకు ఫీజులు తమకు చెల్లించాలని తల్లితండ్రులపై తీవ్ర వత్తిడి తీసుకొస్తుందని ఇది ఎంత మాత్రం తగదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి నేరుగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత జిల్లా విద్యాశాఖాధికారీ కార్యాలయం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ 1 బత్తుల సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ గవర్నమెంట్ ఎక్సమినేషన్స్ జి. శ్రీనివాస్, రాష్ట్ర ఎంజీవో నాయకులు డిఇ ఓ కార్యాలయ సూపరెండెంట్ పాండ్రక వెంకటేశ్వరరావు లు మంత్రి పేర్ని నానిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని వారితో మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ వరకు అమ్మఒడి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న సంగతి, జనవరి 6వ తేదీన ‘అమ్మఒడి’ అర్హుల తుది జాబితాను అందరికి తెలియచేయాలని సూచించారు.
రెండో విడత ‘అమ్మఒడి’ కింద ప్రభుత్వం రూ. 6,450 కోట్లు కేటాయించిందన్నారు . గతేడాది ‘అమ్మఒడి’ లబ్ధిదారులు కూడా ఈ రెండో విడతకు అర్హులేనని.. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ‘అమ్మఒడి’ ఇస్తామని మంత్రి చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ( 2022 ) నుంచి బందరు మండలం బొర్రుపోతుపాలెం గ్రామంలో పాఠశాలను హైస్కూల్ గా అభివృద్ధి చేయాలనీ సూచించారు. పెడన హై స్కూల్ కు ఈ గ్రామం నుంచి ఆడపిల్లలు వెళుతున్నారని, ఆటోలలో సైతం వారిని ఎక్కించుకోవడం లేదని వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.ఎ పి ఎంజీవోల తూర్పు కృష్ణా జిల్లాశాఖ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ ,సాయికుమార్ జెఎసి కన్వీనర్ దారపు శ్రీనివాస్, టౌన్ అధ్యక్ష ,కార్యదర్శులు ఆకూరి శ్రీనివాసరావు ,రమేష్,మహిళావిభాగం. గౌరి,రమాదేవి ఇతర కార్యవర్గ సభ్యులు 2021 నూతన ఆంగ్ల సంవత్సర టేబుల్ కాలండర్ ను మంత్రి పేర్ని నాని చేత ఆవిష్కరింపచేశారు. తోట రఘుకాంత్ ( చిన్నా ) మాస్టారు ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఐక్య ఉపాధ్యాయ సంఘ నేతలు మంత్రి పేర్ని నానిను కల్సి తమ డైరీ , క్యాలండర్ ను ఆవిష్కరింపచేశారు.
మచిలీపట్నం జైహింద్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం వి ఎస్ సూర్య నారాయణ మంత్రి పేర్ని నానికి తమ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య వివరించారు. పల్లె తుమ్మలపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు ఉదయం పూటే మాత్రమే వస్తుందని, ఆ గ్రామం నుంచి తమ పాఠశాలకు 35 మంది విద్యార్థిని విద్యార్థులు వస్తుంటారని మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత బస్సు ఉండటం లేదని ,ఆటోలు సరిగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మంత్రికి తెలిపారు.
గుడ్లవల్లేరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన దివ్యా0గుడు ఓగంటి శ్రీనివాసరావు మంత్రి వద్ద తన కష్టాన్ని మొరపెట్టుకున్నారు. తన మూడు చక్రాల సైకిల్ రిక్షా నడపడం ఎంతో భారంగా ఉందని తనకు ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ కావాలని అభ్యర్ధించారు.