లేఔట్ దగ్గరే 100% ఇంటి పట్టాలు పంపిణీ..
Ens Balu
3
bandaru
2021-01-02 19:46:18
ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే 100 శాతం లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని కట్రామయ్య ( నాని ) తెలిపారు. శనివారం సాయంత్రం బందరు మండలంలోని తపసిపూడి గ్రామంలో 2 ఎకరాల 18 సెంట్లలో 77 మంది అర్హులైన వారిలో లబ్ధిదారులకు 83 ప్లేటులలో ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్క స్థాయిలో అధికారులంతా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే ఇంటి పట్టాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని, ఖచ్చితంగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన రోజున లేఔట్ స్థలంలోనే ఎలాంటి ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు పట్టాలివ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పి డీ , ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ , మచిలీపట్నం తహసీల్దార్ డి .సునీల్ బాబు , మాజీ జడ్‌పీటీసీ సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా , మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్ పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు యాకూబ్, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.