విజయసాయిరెడ్డి కాన్వాయ్ పై దాడి హేయమైనది..


Ens Balu
6
Visakhapatnam
2021-01-02 20:50:30

విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన దుర్ఘటన పరిశీలించేందుకు వెళ్లిన  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి కాన్వాయి పైన జరిగిన దాడి హేయమైన చర్య అని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వకర్త కెకె రాజు అన్నారు. శనివారం విజయనగరంలో జరిగిన దాడికి కి నిరసనగా విశాఖలో జాతీయ రహదారి తాటిచెట్లపాలెం కూడలిలో నల్ల వస్త్రాలు, ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ, చంద్రబాబు డైరెక్షన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దుర్మార్కపు చర్య అని ఆరోపించారు. ఆయన కాన్వయ్ పై దాడి జరిగినా విజయసాయిరెడ్డి హుందాగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని అడ్డుకునేందుకు దేవతా మూర్తులతోనూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చంద్రబాబు ఈ విశాఖలో ఆగి విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని చెప్పే దమ్ము ఉందా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు,వార్డు అధ్యక్షులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.