మహిళా లోకానికి సావిత్రీభాయ్ ఫూలే ఆదర్శం..
Ens Balu
3
Visakhapatnam
2021-01-03 13:11:49
భారత దేశంలో స్త్రీ విద్యకు బాటలు వేసి, వితంతు దురాచారాలకు విముక్తి కలిగించిన దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీభాయ్ ఫూలే అని విశాఖజిల్లా బిసి సంఘం యువజన మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శిలు, కె.జయలక్ష్మి, ధనుకోటి రమ కొనియాడారు. ఆదివారం సీతంపేటలోని కార్యాలయంలో సావిత్రీభాయ్ ఫూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల చిత్రాలకి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వివక్షకు గురవుతున్న మహిళల కోసం ఉద్యమించిన తొలి మహిళ ఫూలే అని కీర్తించారు. దళితులకు అంటరాని తనంచి విముక్తి కలిగించడంతోపాటు, మహిళలు చదువుకుంటే అన్ని వాషయాలు తెలుస్తాయనే ఉద్దేశ్యంతో 1952 మహిళా సేవా మండల్ ను ఏర్పాటు చేసి మహిళలకోసం ఉద్యమించారని గుర్తు చేశారు. నేటి యాంత్రిక జీవనంలో మహిళలంతా ఫూలేని ఆదర్శంగా తీసుకొని చదువుకోడం ద్వారా సంఘంలో గౌరవం దక్కుతుందన్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతోపాటు మహిళలు కూడా రాణించడానికి అవకాశం వుంటుందన్నారు. మహిళలు, విద్యార్ధినిలు సావిత్రీభాయ్ ఫూలేని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వస్తున్న తరుణంలో విశాఖ వాసులు, మహిళలు జాగ్రత్తు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు చిన్నారులకు మిఠాయిలు పంపిణి చేపట్టారు.