జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ..
Ens Balu
3
Vizianagaram
2021-01-03 19:13:18
విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డ్ స్థాయి లో జరిగిందని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. గత ఏడాది జనవరి 3 నాటికి 7 వేల మెట్రిక్ టన్నులను సేకరించగా ఈ ఏడాది నేటికి 14 వేల 600 మంది రైతుల నుండి ఒక లక్ష 8 వేల 160 మెట్రిక్ టన్నులను సేకరించడం జరిగిందన్నారు. ఆదివారం జే.సి ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెబ్రవరి నెలాఖరు కల్లా జిల్లా లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేయాలనీ అన్నారు. అందు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు జనవరి నెలలో కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నులను సేకరణ పూర్తి చెయ్యాలన్నారు. రోజుకు కనీసం 15 వేల మె.టన్నులను సేకరించేలా సమిష్టిగా పనిచేయాలన్నారు. పౌర సరఫరాల , డి.ఆర్.డి.ఎ, మొలక సంస్థ, పాక్స్, వ్యవసాయాధికారులు, ఎ.ఎస్.ఓ లు, గిరి వెలుగు అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేసారని, ఇదే స్పూర్తి కొనసాగితే జిల్లాలో సేకరణలో రికార్డ్ సృష్టిస్తామని అన్నారు. 185 మిల్లులను ట్యాగ్ చేయడం ద్వారా 257 కొనుగోలు కేంద్రాల ద్వార సేకరణ జరుగుతోందని తెలిపారు. గొనె సంచుల సమస్య లేదని, 2016-17 లో ఇచ్చిన గొనె సంచులను మిల్లర్లు తిరిగి ఇవ్వడం జరిగిందని, వాటికీ రీ కన్సిలెషన్ జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారితో గౌరవంగా మాట్లాడి, ఒప్పించి సేకరించాలన్నారు. పిపిసి వద్ద ఖచితమైన తూకం ఉండాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కుర్మనాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ , డి.సి.సి.బి సి.ఈ.ఓ, ఫై.డి. డి.అర్.డి.ఎ., మొలక ప్రతినిధులు పాల్గొన్నారు.