భోగాపురం భూసేకరణ త్వరగా జరగాలి..


Ens Balu
2
Vizianagaram
2021-01-03 19:15:23

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భోగాపురం ఎయిర్  పోర్ట్ కు సంబంధించిన భూ సేకరణ ను  అత్యంత ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్  డా.జి.సి.కిషోర్ భూ సేకరణ అధికారులకు ఆదేశించారు.  ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం లో భూ సేకరణ , ఆర్ అండ్ ఆర్ పనుల పై సమీక్షించారు.   ఇప్పటికే 95 శాతం వరకు భూ సేకరణ పనులు పూర్తయ్యాయని, మిగిలినది  కూడా నిబంధన మేరకు పూర్తి చేయాలని సూచించారు.  మిగిలిన భూ సేకరణ పై  రైతులతో  మాట్లాడి ఒప్పించాలని అన్నారు.   ఈ  సమావేశం లో విజయనగరం రెవిన్యూ డివిజినల్ అధికారి భావాని శంకర్,  భోగాపురం తహసిల్దార్  రాజేశ్వర రావు,  కలెక్టరేట్ పర్యవేక్షకులు సూర్య లక్ష్మి , రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.